మెస్మరైజ్ చేస్తున్న సాయిప‌ల్ల‌వి..!!

SMTV Desk 2018-05-09 12:33:57  sai pallavi, birthday, p[adi padi leche manasu poster out.

హైదరాబాద్, మే 9 : "ఫిదా" ఫేం సాయి పల్లవి.. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. నేచురల్ స్టార్ నానితో కలిసి నటించిన "ఎ౦సీఏ" చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల "కణం" సినిమాలో ఒక పాపకి తల్లిగా నటించింది. తాజాగా ఈ తమిళ భామ ప్రస్తుతం శర్వానంద్ సరసన "పడి పడి లేచే మనసు" చిత్రంలో నటిస్తోంది. నేడు సాయి ప‌ల్ల‌వి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మ‌రో పోస్టర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్టర్‌లో బెంగాలీ త‌ర‌హా చీర‌కట్టుతో సాయిప‌ల్ల‌వి అభిమానులను అలరిస్తోంది. ఈ సినిమాకు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కత్వం వహించగా విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీత అందించారు. మార్చి 6వ తేదీన శ‌ర్వానంద్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.