ఇంగ్లాండ్ వన్డేకు రాయుడు, కే.ఎల్

SMTV Desk 2018-05-09 11:38:22  England ODIs selection, k.l rahul, ambati rayudu, ireland

బెంగళూరు, మే 9 : ఐపీఎల్ లో విశేషంగా రాణిస్తున్న తెలుగు తేజం అంబటి రాయుడు, కే.ఎల్. రాహుల్ ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్ జట్టులో స్థానం సంపాదించుకొన్నారు. అయితే ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లకు మాత్రం వీరికి జట్టులో చోటు లభించలేదు. సన్‌రైజర్స్‌ తరఫున ఆకట్టుకొంటున్న పేస్‌ బౌలర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ రెండు జట్లలోనూ స్థానం దక్కించుకొన్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగే చారిత్రక టెస్టు మ్యాచ్‌ (జూన్‌ 14-18) కోసం విరాట్‌ కోహ్లి స్థానంలో కరుణ్‌ నాయర్‌ జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌లో విఫలమైన రోహిత్‌ శర్మ టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. కోహ్లి కౌంటీ క్రికెట్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. కోహ్లి గైర్హాజరీలో అజింక్య రహానె టెస్టు జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. కోహ్లి ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌లతో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ఆడనున్నాడు. మరోవైపు పేస్‌ బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. వన్డే జట్టు (ఇంగ్లాండ్‌తో సిరీస్‌): కోహ్లి, ధావన్‌, రోహిత్‌, రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రాయుడు, ధోని, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య, సిద్ధార్థ్‌ కౌల్‌, ఉమేశ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌. టీ20 జట్టు (ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లకు): కోహ్లి, ధావన్‌,. రోహిత్‌ శర్మ, రాహుల్‌, రైనా, మనీష్‌ పాండే, ధోని, దినేశ్‌ కార్తీక్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌, బుమ్రా, హర్దిక్‌ పాండ్య, సిద్ధార్థ్‌ కౌల్‌, ఉమేశ్‌ యాదవ్‌. టెస్టు జట్టు: రహానె, ధావన్‌, విజయ్‌, రాహుల్‌, పుజారా, కరుణ్‌ నాయర్‌, సాహా, అశ్విన్‌, జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, హార్దిక్‌ పాండ్య, ఇషాంత్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌. భారత్‌ షెడ్యూల్‌ : * భారత్‌గీ ఆప్ఘానిస్థాన్‌ ఏకైక టెస్టు ( జూన్‌ 14-18: బెంగళూరు) * ఐర్లాండ్‌తో టీ-20 సిరీస్‌ జూన్‌ 27: తొలి టీ-20 (డబ్లిన్‌) జూన్‌ 29: రెండో టీ-20 (డబ్లిన్‌) * ఇంగ్లండ్‌తో సిరీస్‌ (జులై 3 నుంచి సెప్టెంబరు 11 వరకు) (3 టీ-20లు, 3 వన్డేలు, 5 టెస్టులు)