కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన సమ౦త..

SMTV Desk 2018-05-08 17:04:53  SAMANTHA, CASTING COUCH, SAMANTHA TALKING ABOUT CATING COUCH.

హైదరాబాద్, మే 8: టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పెను దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ లో ఈ విషయంపై శ్రీరెడ్డి చేసిన ఆందోళన అంత ఇంతా కాదు. మొత్తం సినీ ఇండస్ట్రీనే కుదిపేసింది. తాజాగా కాస్టింగ్ కౌచ్ పై ప్రముఖ హీరోయిన్ సమంత స్పందించారు. ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతూ.. అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేసే నీచులు ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగని అందరిని అలాంటి వారే అనుకోవడం పొరపాటు. ఈ సమస్య కేవలం ఒక సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లో ఎక్కడో ఓ చోట ఉన్నారు. నేను నా మొదటి సినిమాతోనే హిట్ కొట్టాను. దాంతో నాకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఇండస్ట్రీలో మంచి వారు ఉన్నారు. సహాయం చేసే వారు ఉన్నారు కాబట్టే... నేను ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా సినిమాలు చేస్తానని వెల్లడించింది.