ఇంగ్లాండ్ పర్యటనకు సారథిగా టిమ్‌ పైన్‌..

SMTV Desk 2018-05-08 15:49:02  tim paine, australia new captain, cricket australia, steve smith

సిడ్నీ, మే 8: బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) స్టీవ్‌ స్మిత్‌పై ఏడాదిపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. వచ్చే నెల(జూన్‌)లో ఆస్ట్రేలియా..ఐదు వన్డేలు‌, ఒక టీ20 మ్యాచ్‌ కోసమని ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో ఈ పర్యటనలో వన్డే సిరీస్‌కు ఆసీస్‌ సారథిగా టిమ్‌ పైన్‌ను ఎంపికచేసినట్లు ఆస్ట్రేలియా కొత్త కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మంగళవారం తెలిపారు. టిమ్‌ పైన్‌.. బాల్‌ టాంపరింగ్ ఉదంతం అనంతరం దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్‌తో వన్డే జట్టుకు కెప్టెన్‌గా పైన్‌ను, వైస్‌ కెప్టెన్‌గా అరోన్‌ ఫించ్‌ను ఎంపిక చేసినట్లు.. ఏకైక టీ20 మ్యాచ్‌కు కెప్టెన్‌గా అరోన్‌ ఫించ్‌ నాయకత్వం వహిస్తారని క్రికెట్‌ ఆస్ట్రేలియా సెలక్టర్స్‌ ఛైర్మన్‌ వెల్లడించారు.