పెళ్ళితో ఒక్కటైనా ప్రేమజంట..

SMTV Desk 2018-05-08 15:29:58  sonam kapoor, anadh, marriage, anil kapoor, boni kapoor.

ముంబై, మే 8: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ కుమార్తె సోనమ్ కపూర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బాంద్రాలోని రాక్‌డేల్ హోటల్‌లో 11 గంటల నుండి 12:30 గంటల మధ్యలో ఈ పెళ్లితంతు జరిగింది. సోనమ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే.. తన లుక్స్ తో మెస్మరైజ్ చేశారు. ఎరుపు రంగు లెహెంగా, భారీ నగలతో మెరిశారు. పెళ్లి కుమారుడు ఆనంద్‌ ఆహుజా గోల్డ్‌ షేర్వానీలో మెరిసిపోయారు. సోనమ్ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు అనిల్‌ కపూర్‌, అర్జున్‌ కపూర్‌, అన్షులా కపూర్‌, హర్షవర్ధన్‌ కపూర్‌, బోనీ కపూర్‌, జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌తో పాటు సినీ ప్రముఖులు కరీనా, సైఫ్‌అలీ ఖాన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, స్వరా భాస్కర్‌, కరణ్‌ జోహార్‌ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా సోనమ్.. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు నేడు వీరిద్దరూ పెళ్ళితో ఒక్కటయ్యారు.