ముచ్చటగా మూడు సార్లు.. మరి ఈ సారి..!

SMTV Desk 2018-05-08 14:49:20  karnataka elections, karnataka hung house, congress, bjp, jds,

కర్ణాటక, మే 8 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బరిలో ఉన్న ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్. ఈ మూడు పార్టీలు విజయం మాది అంటే మాదిని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ మెజారిటీ సర్వేలు మాత్రం హంగ్ తప్పదని వెల్లడిస్తున్నాయి. గత 35 ఏళ్లలో రాష్ట్రంలో మూడుసార్లు (1983, 2004, 2008) మాత్రమే త్రిశంకు సభలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా నెగ్గి మరో సారి సీఎం పీఠం చేజిక్కించుకోవాలని చూస్తుంది. మరో వైపు బీజేపీ పార్టీ కాంగ్రెస్ కు మిగిలిన ఏకైక పెద్దరాష్ట్రం కర్ణాటకను దూరం చేయాలనీ భావిస్తుంది. రాష్ట్రంలో ఉన్న జేడీఎస్ పార్టీ కూడా క్రీయాశీలక పాత్ర పోషించాలని అనుకుంటుంది. ఒక రకంగా హంగ్ పరిస్థితే వస్తే జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుంది. ఈ నెల 12 న జరిగే ఎన్నికల ఫలితాలు 15 న వెలువడనున్నాయి. మూడుసార్లు హంగ్ వచ్చిన కర్ణాటకలో ఈ సారి ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.