ప్రకాష్ రాజ్ ఏ పాత్రలో కనిపించానున్నారంటే..!!

SMTV Desk 2018-05-08 13:47:31  mhanati movie, prkash raj character, alluri chakrapani.

హైదరాబాద్, మే 8: ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్.. సావిత్రి జీవితకథ ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం "మహానటి". కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రియాంక దత్, స్వప్న దత్ లు నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. అయితే ఈ చిత్ర౦లో ప్రకాష్ రాజ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరూ ఏ క్యారెక్టర్లో నటిస్తున్నారో తెలియజేస్తూ వీడియో క్లిప్పింగ్స్‌ని చిత్రబృందం రిలీజ్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపించనున్నారో ఓ వీడియో ద్వారా తెలిపింది. మనందరి మొదటి కథలను మనకు అందించిన మహా రచయిత, బహుభాషా పండితుడు, నిర్మాత, దర్శకుడు చక్రపాణి. చందమామ, విజయా కంబైన్స్ స్థాపకుల్లో ఒకరైన చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించి మెప్పించనున్నారని వీడియోలో తెలిపారు. ప్రకాష్ రాజ్ ను పరిచయం చేస్తూ నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ ఇచ్చాడు.