వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు..

SMTV Desk 2018-05-08 13:35:59  summer special trains, south central railway, lingampally to visakhapatnam, hyderabad

హైదరాబాద్, మే 8 : వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌ స్టేషన్లపై రద్దీని తగ్గించి.. లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. లింగంపల్లి-కాకినాడ, విశాఖపట్నం మధ్య మొత్తం 30 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. లింగంపల్లి నుంచి విశాఖపట్నంకు (07148) మే11, 18, 25, జూన్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది.