టీడీపీకి రాంరాం.. వైసీపీ గూటికి

SMTV Desk 2018-05-08 11:59:45  bollinei rammohan naidu, bollinei rammohan naidu jump to ysrcp, tdp, kadapa

కడప, మే 8: తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన బొల్లినేని రామ్మోహన్‌నాయుడు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సమక్షంలో సోమవారం వైసీపీ గూటికి చేరారు. వైసీపీ రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి నేతృత్వంలో బొమ్మినేని రామ్మోహన్‌నాయుడు అనుచరులు భారీ ఎత్తున వారి స్వగ్రామంలో వైసీపీలో చేరారు. వీరికి ఎంపీ మిథున్‌రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ర్యాలీలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మెన్‌ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.