హంస తూలికా తల్పంపై.. కీర్తి..

SMTV Desk 2018-05-08 11:14:37  KEERTI SURESH, MAHANATI MOVIE, NEW LOOK REVEAL, SAVITRI.

హైదరాబాద్, మే 8: ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్.. సావిత్రి బయోపిక్ "మహానటి" రేపు విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే. చూడడానికి అచ్చం సావిత్రిలా కీర్తి ఆ పాత్రలో ఇమిడిపోయింది. అయితే కీర్తికి సంబంధించి రోజుకో పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేస్తూ వస్తో౦ది. తాజాగా కీర్తి కి సంబంధించి మరో లుక్‌ను రిలీజ్ చేసింది. హంస తూలికా తల్పంపై అచ్చం సావిత్రిలా కూర్చొన్న కీర్తి లుక్‌ అదుర్స్ అనిపిస్తుంది. మొత్తం ఈ చిత్రంలో కీర్తి 110 లుక్స్ తో కనిపించనుందని దర్శకుడు నాగ అశ్విన్ వెల్లడించారు. సమంత, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ తదితరులు నటిస్తున్నారు.