సావిత్రి స్నేహితురాలి పాత్రలో షాలిని పాండే..

SMTV Desk 2018-05-07 16:12:08  MAHANATI MOVIE, SHALINEE PANDE, SUSHILA CHARACTER.

హైదరాబాద్, మే 7 : అలనాటి మేటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం "మహానటి". కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రియాంక దత్, స్వప్న దత్ లు నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. అయితే ఈ చిత్ర౦లో శాలినీ పాండే ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఆమె పోషించిన పాత్ర ఏంటి అని చాలా మంది అభిమానులు తెగ ఆలోచించి ఉంటారు. తాజాగా చిత్ర యూనిట్ శాలినీ క్యారెక్టర్ ఏంటో చెప్పేసింది. సావిత్రి చిన్ననాటి స్నేహితురాలు సుశీల పాత్రలో షాలిని పాండే కనిపించనుందట. ఇందుకు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేశారు. శాలినీ పాత్రను నేచురల్ స్టార్ నాని పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చారు. సావిత్రి స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తన స్నేహితురాలు సుశీలతో అంతే చనువుగా ఉండేవారట.