విండీస్ సిరీస్‌ భారత్‌ కైవసం

SMTV Desk 2017-07-07 16:26:19  cricket, india, westindies, virat kohli, ajinkya rahane,

కింగ్ స్టన్, జూలై 07 : గురువారం కింగ్‌స్టన్‌లో జరిగిన చివరి వన్డేలో విండీస్ జట్టు తొలిత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హోప్‌ సోదరులు షెయ్‌(51), కైల్‌(46) పరుగులు సాదించారు. భారత్ జట్టు బౌలర్స్ షామీ, ఉమేష్ యాదవ్ విండీస్ బాట్స్ మెన్ లను కట్టుదిట్టం చేసారు. విండీస్ జట్టు 9 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 206 పరుగులు విజయలక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ తొలుత తడబడింది. ఆ తరువాత బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 115 పరుగులు, కార్తీక్ 50 రన్స్ సాదించారు. 8 వికెట్లు నష్టపోకుండా మ్యాచ్ భారత్ వశమయ్యింది. దీంతో 3-1 తేడాతో సిరీస్‌ను కోహ్లీసేన సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 115 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి కి "మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌" దక్కగా, ఈ సిరీస్ లో అత్యధికంగా 336 పరుగులు చేసినందుకు ఆజింక్య రహానె "మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌" అవార్డును అందుకున్నారు.