టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

SMTV Desk 2018-05-06 16:00:34  kkr vs mi, dinesh karthik, kkr, ipl-11

ముంబై, మే 6 : టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ దినేశ్‌ కార్తీక్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నందున ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకున్నట్లు దినేశ్‌ కార్తీక్‌ తెలిపాడు. మరోవైపు రింకూ స్థానంలో నితీశ్‌ రాణా, శివమ్‌ మావి స్థానంలో కృష్ణను జట్టులోకి తీసుకున్నట్లు కార్తీక్‌ చెప్పాడు. ముంబై జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగితుంది.