జడేజా రియాక్షన్.. నెటిజన్ల కామెంట్లు

SMTV Desk 2018-05-06 15:23:18  kohli-jadeja, rcb vs csk, ipl, jadeja wicket to kohli

బెంగళూరు, మే 6 : టీమిండియా క్రికెట్ సారథి విరాట్ కోహ్లి వికెట్ తీసుకోవాలని ఎవ్వరికి ఉండదు చెప్పండి. అదే వికెట్ దక్కితే..ఇంకా ఆ బౌలర్ సంబరాలు చెప్పడానికి మాటలు చాలవు. అయితే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో చెన్నై ఆల్‌రౌండర్‌ జడేజా మాత్రం కోహ్లీ వికెట్‌ తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి సంబరాలు జరుపుకోలేదు. ఈ సీజన్‌లో మొదటి నుండి విఫలమవుతూ జడేజా (4/18) బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయాడు. ‘ఇది నా తొలి బంతి.. అందుకే విరాట్‌ వికెట్‌ పడినా సంబరాలు చేసుకునేందుకు నేను ఆ సమయంలో సిద్ధంగా లేను. విరాట్‌ వికెట్‌ ఎప్పటికీ పెద్ద వికెటే’ అని జడేజా వివరణ ఇచ్చాడు. అయితే జడేజా సంబరాలు చేసుకోకపోవడంపై ఇప్పుడు ట్విటర్‌లో అభిమానులు అతనిపై జోకులు పేలుస్తూ ఆటపట్టిస్తున్నారు. అభిమానులు పెట్టిన పలు సరదా ట్వీట్లు.. * విరాట్ కోహ్లీకి భయపడే జడేజా సంబరాలు చేసుకోలేదు. * కోహ్లీ వికెట్‌ తీసి జడేజా మొదటిసారి షాక్‌కు గురయ్యాడు. * కోహ్లీ వికెట్‌ తీశావ్‌.. నీ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ ఇక ఖతం.