సొంత జట్టుకు ఆడినట్టు ఉంది : రషీద్ ఖాన్

SMTV Desk 2018-05-06 13:30:09  Rashid Khan, srh rashid khan, ipl-11, delhi dare devils

హైదరాబాద్, మే 6‌: వేదిక ఏదైనా... లక్ష్యం ఏదైనా.. ప్రత్యర్ధి ఎవరైనా.. సన్ రైజర్స్ ఆట తీరు అప్రతిహతంగా దూసుకుపోతుంది. టోర్నీలో పాల్గొన్నఉన్నఎనిమిది జట్లలో అత్యంత బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో ఆదరగోడుతుంది. ఈ క్రమంలో శనివారం ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయితే తొలి నుండి బంతితో మాయ చేస్తున్న స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌.. ఢిల్లీతో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. నాలుగు ఓవర్లు వేసి 23పరుగులిచ్చి..రెండు వికెట్లు పడగొట్టి దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. దీంతో టోర్నీలో మొత్తం 12 వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సందర్భంగా రషీద్‌‌ మాట్లాడుతూ.."సన్‌రైజర్స్‌కు ఆడుతుంటే సొంతజట్టు అఫ్గానిస్థాన్‌కు ఆడుతున్నట్లే అనిపిస్తోంది. ఇంత తక్కువ వయస్సులో ఎక్కువ మ్యాచ్‌లాడి వాటిలోనూ అద్భుతంగా రాణించడం ఎంతో ఆనందంగా ఉంది. రెండు మ్యాచ్‌లలో తడబడినా..తర్వాతి నుంచి కుదురుకొని ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. అదే నా బలం. నా బౌలింగ్‌ శైలే మ్యాచ్‌లో రాణించేలా తోడ్పాటునందిస్తోంది" అని రషీద్‌ ఖాన్‌ పేర్కొన్నాడు.