ఇప్పటికైనా ఆ వదంతులు ఆపండి : ఎమ్మెల్యే అదితీ సింగ్‌

SMTV Desk 2018-05-06 12:15:50  rahul marriage, roumours about rahul gandhi, MLA Aditi Singh, karnataka elections

రాయ్‌బరేలీ, మే 6 : కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. రాయ్‌బరేలీ నియోజకవర్గ ఎమ్మెల్యే అదితీ సింగ్‌ను పెళ్లాడనున్నారన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఈమేరకు ఇరు కుటుంబాలు చర్చించుకున్నారంటూ రాహుల్‌-అదితీ కలిసి ఉన్న ఫొటోలను అంతర్జాలంలో ఉంచారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఇదే నెలలో వీరిద్దరి పెళ్లి జరగనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు మొదటగా రాయ్‌బరేలీలోని కొందరు వాట్సాప్‌ వేదికగా ప్రచారం చేసినట్లు సమాచారం. అయితే ఈవార్తల్లో ఎటువంటి నిజం లేదని అదితీ సింగ్‌ స్పష్టం చేశారు. దీనిపై అదితీసింగ్‌ మాట్లాడుతూ... " రాహుల్‌ నాకు పెద్దన్నయ్యతో సమానం. ఆయన నాకు రాఖీ బ్రదర్. సామాజిక మాధ్యమాల్లో సంచలనం అవుతోన్న ఈ వార్తలను విని ఎంతగానో బాధపడ్డాను. ఈ వార్తలు నన్ను చాలా బాధించాయి. ఇప్పటికైనా వీటికి ఇంతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. అయితే ఈ వార్తలపై సోనియా కానీ, రాహుల్‌ గానీ స్పందించలేదు.