కర్ణాటక రణంకు 58,008 పోలింగ్‌ కేంద్రాలు..

SMTV Desk 2018-05-06 11:43:28  karnataka elections, ec in karnataka, polling stations, ec

బెంగళూరు, మే 6 : కన్నడ నాట ఈ నెల 12న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కర్ణాటక చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి సంజీవ్‌ కుమార్‌ శనివారం వెల్లడించారు. దీనిలో భాగంగా ఈ ఎన్నికలకు మొత్తం 58,008 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు మొత్తం మహిళా సిబ్బందితో 600 పింక్‌ పోలింగ్‌ కేంద్రాలను కూడా అందుబాటులో తీసుకొస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ సమయంలో రాజకీయ పార్టీలు ఓట్లరు మభ్య పెట్టేందుకు చేసిన అన్ని రకాల ప్రలోభాలను నిఘా వర్గాలు ఛేదించాయని అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటివరకూ రూ.67.27 కోట్లు నగదు.. 50,430 లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనంలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, మే 15న ఫలితాలు రానున్నాయి.