నోరు తాజాగా ఉండాలంటే...

SMTV Desk 2018-05-06 11:30:56  mouth fresh tips, tooth care, hyderabad, mouth freshner

హైదరాబాద్, మే 6 : దంతాల సంరక్షణకు, దుర్వాసన రాకుండా ఉండేందుకు అదే పనిగా మౌత్‌ఫ్రెష్‌నర్లనే వాడాల్సిన పని లేదు. కొన్ని పండ్లూ, పదార్థాలతోనూ వాటిని సాధించొచ్చు. అందుకోసం ఉపయోగపడేవి మీ కోసం.. >> యాపిల్‌: సాయంత్రం పూట ఆకలివేసినప్పుడు బిస్కెట్లు తినేబదులు ఒక యాపిల్‌ని లాగించేయండి. దీనిలోని మాలిక్‌ యాసిడ్‌ పళ్లని శుభ్రం చేస్తుంది. నోరూ తాజాగా ఉంటుంది. >> స్ట్రాబెరీ, అనాస: వీటిలో బ్రొమిలీన్‌, విటమిన్‌ సి పోషకాలు ఉంటాయి. ఈ పండ్లని ఎప్పుడు తిన్నా నోరు తాజాగా మారుతుంది. >>చీజ్‌, పనీర్‌: వీటిల్లోని క్యాల్షియం, ఫాస్ఫరస్‌ నోటిలో లాలాజలం ఉత్పత్తికావడానికి సహకరిస్తాయి. నోట్లో తగినంత లాలాజలం ఉన్నప్పుడు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా ఉత్పత్తి కాదు. >> నీరు: ఎన్ని తిన్నా నీటిని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే నీరు నోటిలోని యాసిడ్‌ ఉత్పత్తులను నియంత్రణలో ఉంచుతుంది. >> బాదం: బాదంలో దంతాల ఆరోగ్యాన్ని కాపాడే ప్రత్యేక ప్రొటీన్లుంటాయి. పళ్లకి ఎంతో మేలు చేస్తాయి. >> పెరుగు: పెరుగులోని మంచి చేసే బ్యాక్టీరియాలు నోటి ఆరోగ్యానికీ ఉపయోగపడతాయి. దీనికి బాదం పలుకులూ, స్ట్రాబెరీ కలుపుకుంటే తాజాదనానికి ఢోకా ఉండదు.