సన్ రైజర్స్ టాప్..

SMTV Desk 2018-05-06 10:42:48  srh vs dd, sun risers hyderabad, ipl, alex hales

హైదరాబాద్, మే 6 : ఐపీఎల్‌-11లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జోరు కొనసాగుతుంది. శనివారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలోకి దూసుకెళ్లింది. ఒక దశలో భారీ స్కోర్ చేసేలా కన్పించిన ఢిల్లీ జట్టును హైదరాబాద్ తమ బౌలింగ్ తో కట్టడి చేసింది. తొలుత టాస్ నెగ్గిన ఢిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. డేర్‌డెవిల్స్‌ జట్టులో పృథ్వీ షా (65), శ్రేయస్‌ అయ్యర్‌ (44) రాణించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టులో ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ (45), శిఖర్ ధావన్(33) మెరుపు ఆరంభాన్నివ్వగా.. చివర్లో కెప్టెన్ యూసుఫ్‌ పఠాన్‌ (27 నాటౌట్‌), విలియంసన్ (32,నాటౌట్) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో జట్టుకు. దీంతో హైదరాబాద్‌ 19.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు రషీద్ ఖాన్ (2/23) ను వరించింది.