బెంగుళూరు పై చెన్నై సవారీ..

SMTV Desk 2018-05-06 10:08:04  chennai super kings, rcb, ipl, dhoni

పుణె, మే 6 : ఐపీఎల్ లో బెంగుళూరు కథ దాదాపు ముగిసినట్లే..! తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలయ్యింది. అన్ని విభాగాల్లో రాణించిన ధోని సేన ఆరు వికెట్ల తేడాతో బెంగుళూరు నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లి సేన చెన్నై స్పిన్నర్ల ధాటికి విలవిలలాడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు జడేజా (3/18), హర్భజన్‌ (2/22) ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులే చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై జట్టులో అంబటి రాయుడు (32), రైనా (25), ధోని (31 నాటౌట్‌) రాణించారు. దీంతో ఆ జట్టు లక్ష్యాన్ని చెన్నై 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు జడేజాకు దక్కింది.