కొంచెం కోపంగా... కొంచెం ఇష్టంగా

SMTV Desk 2018-05-05 18:38:24  children care, parents tips hold children, hyderabad, childrens

హైదరాబాద్, మే 5 : పిల్లలు చేసే కొన్ని చిలిపి పనులు మనకు సరదాగా అనిపించినా.. కొన్ని సార్లు ఆ చిలిపి పనులు చిరాకు తెప్పిస్తాయి. ఎంత చెప్పిన చిచ్చర పిడుగులు మన మాట ఆసలు వినరు. అలాంటప్పుడు మన సహనం కూడా తగ్గుతుంది. కోపం ఎక్కువవుతుంది. కానీ పొరబాటున కూడా దాన్ని ప్రదర్శించకూడదంటున్నారు నిపుణులు!. అప్పుడు కొంచెం కోపంగా.. కొంచెం ఇష్టంగా వ్యవహరించాలి. >> మీ పిల్లలు వస్తువులన్నీ చిందరవందర చేస్తున్నారని అనుకుందాం. మీరొక్కసారి గదమాయించగానే ఒకసారి వూరుకోవచ్చు. కానీ తర్వాత్తర్వాత మీ అరుపులు పనిచేయవు. ‘అరుస్తారు.. అంతేకదా!’ అనుకునే స్థాయికొస్తారు. ఆ తర్వాత చేయిచేసుకోవాల్సి వస్తుంది. దాంతో మీరు చెప్పింది వినకపోవడమే కాదు.. ఆ పనిని రహస్యంగా చేయడం అలవాటు చేసుకుంటారు. పైగా శారీరక హింసవల్ల మీతో మానసికంగా దూరం పెంచుకుంటారు! >> మీ గొంతు పెంచకుండా వాళ్లు చేసే పనివల్ల వచ్చే నష్టమేంటో వివరించండి. మీవాడు బెడ్‌పైకెక్కి దూకుతూ ఉన్నాడని అనుకుందాం. దానివల్ల కిందపడిపోయే ప్రమాదముందని ఒక్కసారి వివరంగా చెప్పండి. మీ మాట విని కిందికొచ్చారా సరే.. వినకపోతే మళ్లీ మళ్లీ అదే చెప్పొద్దు. మరి? >> మీరు ఆ ఒక్కసారి చెప్పినా వినలేదా? ‘నీకు ఈ రోజు ఐస్‌క్రీమ్‌ లేదు మరి!’, ‘ఈ రోజంతా స్కూటీ రైడ్‌కి తీసుకెళ్లను’ అని చిన్నపాటి ‘శిక్షలు’ వేస్తానని చెప్పండి. వాటిని తప్పకుండా అమలుచేయండి. అప్పుడు దారిలోకి వస్తారు.