అయ్యో.. బెంగుళూర్..

SMTV Desk 2018-05-05 18:04:31  rcb vs csk, rcb, kohli, ipl-11

పుణె, మే 5 : పటిష్ట బ్యాటింగ్ బలం కలిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు స్వల్ప స్కోర్ కే పరిమితమయ్యింది. టోర్నీలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య పుణె వేదికగా జరుగుతున్నా మ్యాచ్ లో.. చెన్నై స్పిన్నర్లు ధాటికి ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. టాస్ నెగ్గిన చెన్నై సారథి ధోని ఫీల్డింగ్ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు జట్టులో చాలా రోజుల తర్వాత వచ్చిన ఓపెనర్ పార్థివ్ పటేల్(53) తప్ప అందరు విఫలమయ్యారు. మెక్‌కలమ్‌ (5), విరాట్‌ కోహ్లీ (8), ఏబీ డివిలియర్స్‌ (1), మన్‌దీప్‌ సింగ్‌ (7) సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. చివర్లో టిమ్‌ సౌథీ (36 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో ఆ జట్టు స్కోరు 127కు చేరుకుంది. చెన్నై బౌలర్లలో జడేజా (18/3), హర్భజన్ సింగ్ (2/22) రాణించారు.