గ్లామర్ కోసం.. గోధుమ పూత

SMTV Desk 2018-05-05 17:43:41  health tips, wheat uses, face pack, wheat

హైదరాబాద్, మే 5 : గోధుమలు ఆరోగ్యానికే కాదు... అందానికీ కూడా ఉపకరిస్తాయి. ముఖంలో జిడ్డు తొలగిపోవడానికీ, నల్ల మచ్చలూ, నలుపు పోవడానికీ గోధుమపిండితో వేసే పూత మంచి ఫలితాలనిస్తుంది.. >> మూడు చెంచాల గోరువెచ్చని పాలల్లో చెంచా గులాబీనీరూ, కొద్దిగా తేనె, రెండు చెంచాల గోధుమపిండిని వేసి ఉండ కట్టకుండా కలపాలి. దీన్ని ముఖానికి వేసుకుని ఆరిన తర్వాత కడిగేసి మాయిశ్చరైజర్‌ రాయాలి. తేమతో చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. >> రెండు చెంచాల పాలమీగడకు దీనికి గోధుమపిండి కలిపి చక్కని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ పూతకి చర్మంలోని మెలనిన్‌ని నియంత్రించి నల్లమచ్చలు రాకుండా చేసే శక్తి ఉంది. >> నాలుగుచెంచాల గోధుమపిండికి తగినన్ని నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి దట్టంగా పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు... జిడ్డుపోయి ముఖం కాంతితో నిగారిస్తుంది. >> ఒక కప్పు వేడినీటిలో గుప్పెడు గులాబీ రెక్కలు, కొద్దిగా తేనె, చెంచా నిమ్మతొక్కల పొడీ వేసుకోవాలి. ఇందులో గోధుమ పిండి కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇది ముఖంలోని ముడతలని తగ్గించి గరుకుగా ఉండే చర్మాన్నిసున్నితంగా మారుస్తుంది.