ఆలివ్ నూనెతో.. తుడిచేయండి

SMTV Desk 2018-05-05 15:32:06  olive oil,olive oil tips, body care, hyderabad

హైదరాబాద్, మే 4 : కొన్ని వృత్తులరీత్యా రోజూ వేసుకోవడం వరకే ఒకే. కానీ రాత్రి పూర్తిగా తోలిగించాల్సి ఉంటుంది. లేకపోతే అలంకరణ తాలుకా రసాయన అవశేషాలు ఉండిపోయి ముఖంపై మొటిమలూ, ఇతర సమస్యలు తలెత్తుతాయి. >> అలంకరణ వదిలించుకోవడానికి మనలో చాలా మంది క్లెన్సింగ్ మిల్క్ వాడతారు. కానీ దానిలో ఎంతో కొంత రసాయనాల వాడకం ఉంటుంది. కాబట్టి.. ఆలివ్ నూనెలో ముంచిన దూదితో ముఖం, మెడా తుడిస్తే మలినాలు తొలిగిపోతాయి. >> కీరదోస కూడా చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఫ్రిజ్ లోంచి తీసిన చల్లని కీరదోసని ముద్దలా చేసుకోవాలి. దీనికి కొద్దిగా బాదం కలిపి ముఖానికి మెడకీ రాసుకోవాలి. కాసేపయ్యాక దూదితో తుడిచి నీళ్ళతో కడిగేయాలి. >> బాదంనూనెను ముఖానికి రాసుకోవాలి. ఇది అలంకరణని సులభంగా తొలిగిస్తుంది. ఆపై కొద్దిగా మాయుశ్చరైజర్ ని రాసుకొని పడుకుంటే మర్నాటికి ముఖం తాజాగా కన్పిస్తుంది. >> పెద్దగా సమయం లేనప్పుడు అందుబాటులో బేబీవైప్స్ ఉంటే వాటితో తుడిచినా అలంకరణ తాలుకా జిడ్డు, రసాయనాలు, సమూలంగా తొలిగిపోతాయి. కంటికి వేసిన మస్కారా, ఐలైనర్ వంటి వాటిని తొలిగించడానికి పచ్చిపాలు ఉపయోగపడతాయి.