మా ఓటమికి కారణం ఆదే : అశ్విన్

SMTV Desk 2018-05-05 15:02:53  kings x1 punjab, ashwin, mumbai indians, ipl-11

ఇండోర్‌, మే 5 : ఐపీఎల్ టోర్నీ లో భాగంగా ఇండోర్ లో ముంబై ఇండియన్స్- కింగ్స్ X1 పంజాబ్ కు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై కింగ్స్‌ పంజాబ్‌ సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందించాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన అతను.. "మేము బాగానే ఆడాం. కానీ మంచి స్కోరు సాధించలేకపోయాం. చివర్లో స్టోయినిస్‌ సమయోచితంగా ఆడకపోయి ఉంటే గౌరవప్రదమైన స్కోరు కూడా దక్కేది కాదు" అని వ్యాఖ్యానించాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించిన అశ్విన్‌.. గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓటమి తప్పలేదని పరోక్షంగా బ్యాట్స్‌మెన్ల వైఫల్యాన్ని ప్రస్తావించాడు.