"ఆఫీసర్" రెండవ టీజర్ రిలీజ్..

SMTV Desk 2018-05-05 11:19:06  officer second teaser, nagarjuna ramgopal varma.

హైదరాబాద్, మే 5 : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం "ఆఫీసర్". ఈ చిత్రానికి సంబంధించి రెండవ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇదివరకే ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన ఈ టీజర్ ను మాఫీయా నేపథ్యంలో తెరకెక్కించారు. "రాజకీయాలు, మాఫీయాలలో బయటకు కనిపించేవన్ని నిజాలు కావు. ప్రతి మనిషిలో ఒక దేవుడు, రాక్షసుడు ఉంటారు" అంటూ సాగుతుండగా.. నన్ను నమ్ముతావా.? అని నాగ్ చిన్న పాపను అడుగగా...మీకన్నా ఎక్కువగా అని ఆ పాప చెబుతున్న డైలాగ్ ప్రేక్షకులలో తెలీని ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కంపెనీ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, సుధీర్‌ చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 12 న విడుదల చేయనున్నారు.