ప్రేమ పేరుతో ప్రియురాలికి బెదిరింపులు

SMTV Desk 2017-07-07 13:35:12  rape, blue, films, Threats, man

నల్గొండ, జూలై 07 : సోషల్ మీడియాలో ఎంతో మంది యువతీ యువకులు ప్రేమ పేరుతో బలి అవుతూనే ఉన్నారు. నకిరేకల్‌ మండలానికి చెందిన యువతి చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. ఆ యువతికి పశ్చిమగోదావరి జిల్లా పేరువాలి మండలం ముక్కముల గ్రామానికి చెందిన కలికినేని అమ్మనరాజు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైయాడు. అతడు దుబాయిలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్ళిచేసుకుందాం అనుకున్నారు, కాని ఆ యువతికి అతను ఓ మోసగాడని తెలిసింది. ఈ సంగతి తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. ఎస్పీ ప్రకాష్‌రెడ్డి సహాయముతో, తప్పించుకు తిరుగుతున్న ఆ యువకుడిని గురువారం ముంబయిలో అరెస్టు చేసి నల్గొండ జిల్లాకు తీసుకొచ్చామని డీఎస్పీ సుధాకర్‌ తెలిపారు. ఈ యువతికి ఫేస్‌బుక్‌ ద్వారా తొమ్మిది మాసాల క్రితం పరిచయమయ్యాడని, ఏవో మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నట్లు నాటకమాడి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వీడియో కాల్‌ ద్వారా నగ్నంగా చిత్రీకరించి మూడు నెలలుగా నగ్నచిత్రాలను చూపిస్తూ తనను బెదిరిస్తున్నాడని ఆ యువతి నల్గొండ ఎస్పీని ఆశ్రయించింది. గురువారం ముంబయి విమానాశ్రయంలో నిందితుడిని అరెస్టు చేశారని పోలీసులు తెలిపారు.