ఐపీఎల్ : పూణే టూ కోల్‌కతా

SMTV Desk 2018-05-04 13:10:35  ipl play off matches, kolkata, pune, ipl

ముంబై, మే 4 : ఐపీఎల్ -11 సీజన్ ఐపీఎల్‌ షెడ్యూల్‌లో ఎలిమినేటర్‌, క్వాలిఫైయర్‌-2 మ్యాచ్ వేదికల్లో మార్పులు జరిగాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 23, 25న ఈ మ్యాచ్ లు పూణేలో జరగాల్సింది. కానీ ఈ మ్యాచ్‌లను కోల్‌కతాకు తరలించారు. కావేరీ జల వివాదం కారణంగా చెన్నై సూపర్‌కింగ్స్‌ సొంతగడ్డ చెన్నైలో ఆడాల్సిన మ్యాచ్‌లన్ని ఇప్పుడు పుణె వేదికగా జరుగుతోన్న విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ దేశంలో అతిపెద్ద స్టేడియం, పుణెతో పోల్చుకుంటే ఈడెన్‌ సామర్థ్యం చాలా ఎక్కువ. ఇవన్ని పరిగణలోనికి తీసుకుని నిర్వాహకులు ఈ రెండు మ్యాచ్‌లను తరలించారు. "క్వాలిఫైయర్‌-1లో వేదికలో ఎలాంటి మార్పులు లేవు. కొన్ని కారణాల వల్ల పుణెలో జరగాల్సిన ఎలిమినేటర్‌, క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌లను మాత్రం ఈడెన్‌గార్డెన్స్‌లో నిర్వహిస్తాం. మే 27న జరిగే ఫైనల్‌ యథావిధిగానే ముంబయిలోని వాంఖడేలోనే జరగనుంది" అని ఐపీఎల్‌ అధికారులు తెలిపారు.