వైరల్ : ధోనికి అభిమాని పాదాభివందనం

SMTV Desk 2018-05-04 12:07:12  dhoni, fans touch dhoni feet, csk, ipl

కోల్‌కతా, మే 4 : మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎంతలా అంటే.. ధోనిని దేవుడిలా ఆరాధిస్తారు. తాజాగా ఓ అభిమాని మైదానంలో భద్రతా సిబ్బందిని దాటి వచ్చి క్రీజులో ఉన్న ధోనీ కాళ్లకు మొక్కాడు. ఇలాంటి సంఘటనలు మనం గతంలో పలుసార్లు చూశాం. ఐపీఎల్‌లో భాగంగా గురువారం ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌-చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై..11 ఓవర్లకు ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఆ సమయంలో డగౌట్‌లో ఉన్నాడు ధోనీ,తన టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో ఏదో మాట్లాడుతుండగా ఎలా వచ్చాడో ఓ అభిమాని ధోనీ వద్దకు వచ్చి కాళ్లకు నమస్కరించాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అక్కడికి వచ్చి ఆ యువకుడిని తీసుకుని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ నిర్వాహకులు తమ ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఇది కాస్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మ్యాచ్ లో ధోనీ 25 బంతుల్లో 43 పరుగులతో రాణించాడు. కానీ చెన్నై సూపర్‌కింగ్స్‌ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది