నడుం నొప్పా..? అయితే నిద్రించండి

SMTV Desk 2018-05-03 17:58:11  BACK PAIN, OTHERS, TIPS.

హైదరాబాద్, మే 3 : చాలా మంది మహిళల్ని వేధించే ఆరోగ్య సమస్య నడుము నొప్పి. కారణం ఏదైనా.. మన జీవన విధానంలో చేసుకునే చిన్న చిన్న మార్పుల వల్ల ఈ సమస్యని అదుపులో పెట్టుకోవచ్చు. దానికోసం కొన్ని చిట్కాలు.. >> ఇల్లు, ఆఫీస్.. ఎక్కడైనా సరే.. ఎక్కువ సేపు కదలకుండా కూర్చునేవారిలో నడుము నొప్పి వచ్చే ఆస్కారం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. అలాగే తీరైన ఆకృతిలో కూర్చోకపోవడం, నిల్చోకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. >> కాబట్టి ముందు నిటారుగా కూర్చోవడం, అలవాటుగా మార్చుకోవాలి. గంటల తరబడి కదలకుండా కూర్చోకుండా.. ప్రతి అరగంటకు ఒకసారి లేచి ఓ రెండు మూడు నిముషాలు నడిచేలా చూడాలి. స్త్రేచింగ్ వ్యాయామాలు కూడా చాలా మటుకు అదుపులో ఉంచుతాయి. >> మీరు పడుకొనే పరుపు సౌకర్యంగా ఉండేలా చూసుకోండి. కనీసం ఏడెనిమిది గంటలు కంటినిండా నిద్రపోవడం తప్పనిసరి. దీని వల్ల వెన్నుకి విశ్రాంతి అంది నొప్పులు రాకుండా ఉంటాయి. >> మన శరీర బరువు వీపూ, నడుముపై పడుతుంది. దాంతో కూడా సమస్య ఎదురుకావచ్చు. కాబట్టి మీ బరువును గమనించుకోండి. అధిక బరువు ఉంటే తగ్గించుకునే ప్రయత్నం చేయండి. >> ఒక్క సారిగా వంగి బరువైన వస్తువులు ఎత్తేస్తుంటారు కొందరు. ఇలా తరచూ చేసే వారిలోనూ నడుమునొప్పి తప్పదు. అలా కాకుండా ఉండాలంటే.. వంగి, మోకాళ్ల మీద కూర్చుని అప్పుడే బరువులెత్తాలి.