కేంబ్రిడ్జ్‌ అనలిటికా మూసివేత..

SMTV Desk 2018-05-03 11:24:58  cambridge analytica, facebook, fb data, data analytics

వాషింగ్టన్‌, మే 3 : కేంబ్రిడ్జ్‌ అనలిటికా.. కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలు పత్రికలలో పతాక స్థాయిలో కన్పించింది. ఇందుకు కారణం ఫేస్‌బుక్‌ ఖాతాదారుల సమాచారాన్ని తస్కరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంది. కాగా ఈ సంస్థ మూతపడుతున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ బుధవారం పేర్కొంది. ఈ విషయాన్ని వాటి మేనేజర్లు వెల్లడించినట్లు తెలిపింది. ఫేస్‌బుక్‌ వివాదం కారణంగా తాము వినియోగదారులను కోల్పోయామని, ఇక మీదట కంపెనీని కొనసాగించలేమని వెల్లడించారు. కేంబ్రిడ్జి అనలిటికా మాతృసంస్థ ఎస్‌సీఎల్‌ ఎలక్షన్స్‌ కూడా దివాలా తీసినట్లు ప్రకటించింది. దీని ప్రభావం భారత్‌పైనా పడే అవకాశం ఉంది. అయితే కేంబ్రిడ్జి అనలిటికాను మూసేసినా ఫేస్‌బుక్‌ వివాదం నేపథ్యంలో దానిపై దర్యాప్తు కొనసాగుతుందని బ్రిటన్‌ డేటా రెగ్యులేటర్‌ వెల్లడించింది.