మ్యాక్స్‌వెల్‌కు ఏమైంది..!

SMTV Desk 2018-05-02 19:38:18  maxwell, delhi dare devils, australia, ipl

హైదరాబాద్‌, మే 2 : స్టార్ బ్యాట్స్ మెన్ గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుత సీజన్‌లో విఫలమవుతున్నాడు. సాధారణంగా స్పిన్‌ బౌలింగ్‌ అంటేనే తడబడే మ్యాక్స్‌.. ఈ సీజన్‌లో సైతం వారిని ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. తన బలహీనతను గుర్తించిన ప్రత్యర్థులు.. మ్యాక్స్‌ క్రీజులోకి రాగానే స్పిన్నర్లను బరిలోకి దించుతున్నారు. దీంతో మ్యాక్స్‌వెల్‌ పరుగులు చేయలేక వేగంగా ఆడే క్రమంలో​ వికెట్‌ చేజార్చుకుంటు తీవ్ర తడబాటుకు గురవుతున్నాడు ఈ సీజన్‌లో 30 స్పిన్‌ బంతులను ఆడిన ఈ ఆసీస్‌ ఆటగాడు కేవలం 14.5 స్ట్రైక్‌ రేట్‌తో నాలుగు సార్లు వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఇక ఐపీఎల్‌ చరిత్రలో 651 స్పిన్‌ బంతులను ఎదుర్కున్న మ్యాక్స్‌ 27.12 స్ట్రైక్‌ రేట్‌తో 24 సార్లు ఔటవ్వడం విశేషం. ఈ గణాంకాలే మ్యాక్స్‌ను స్పిన్‌ బౌలర్లు ఎంత వణికిస్తున్నారో స్పష్టం చేస్తున్నాయి. ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ను ఈ సీజన్‌ వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది.