వైఫై స్పీడ్‌ పెంచాలంటే?.. ఇవి పాటించండి..

SMTV Desk 2018-05-02 13:43:52  WIFI SPEED INCREASE TIPS, OTHERS, TIPS.

హైదరాబాద్, మే 2 : మీ ఇంట్లో వైఫై స్ర్టీమింగ్‌ బాగా స్లోగా ఉందా? అయితే ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ఫాలో అయిపోండి. నత్తనడక నడుస్తున్న వైఫై రాకెట్‌ స్పీడ్‌ని అందుకుంటుంది. రూటర్‌ నట్టింట్లో : రూటర్‌ను ఇంట్లో ఏదో ఓ మూలన కాకుండా నట్టింట్లో బిగిస్తే సిగ్నల్‌ పవర్‌ అన్ని దిక్కులా ఒకే వేగంతో ప్రసరిస్తుంది. గోడలు, కబోర్డ్‌ తలుపులు వైఫై సిగ్నల్‌ను బ్లాక్‌ చేస్తాయి. కాబట్టి రూటర్‌ బయటికి కనిపించేలా బిగించుకోవాలి. ఎత్తులో ఉంచితేనే: వైఫై సిగ్నల్‌ కాంక్రీట్‌, వుడ్‌ ఫ్లోరింగ్‌లో నుంచి ప్రసరించలేవు కాబట్టి రూటర్‌ను సాధ్యమైనంత ఎత్తులో బిగించాలి. అప్పుడే పైనున్న ఫ్లోర్‌కు కూడా సిగ్నల్‌ అందుతుంది. విద్యుత్తు పరికరాలకు దూరంగా : టీవీ, కంప్యూటర్‌, కన్‌సోల్స్‌.. .విద్యుత్తుతో పనిచేసే ఎలాంటి ఉపకరణాలకైనా రూటర్‌ దూరంగా ఉండాలి. వీటికి రూటర్‌ను ఎంత దూరంగా ఉంచితే వైఫై సిగ్నల్‌ అంత బాగా అందుతుంది. రూటర్‌ యాంటీనా : రూటర్‌కు రెండు యాంటీనాలు ఉంటే వాటిని రెండు భిన్న డైరెక్షన్స్‌లో ఉంచాలి. అన్ని ల్యాప్టాప్స్ లోనూ ఓ యాంటీనా ఇంటర్నల్‌గా అడ్డంగా ఉంటుంది. ఇక ట్యాబ్‌, మొబైల్‌లు వాడేటప్పుడైతే మనం వాటిని వాడుతున్న విధానాన్ని బట్టి వాటిలోని యాంటీనా యాంగిల్‌ మారుతుంది. కాబట్టి వీటన్నిటికీ వైఫై సిగ్నల్‌ భేషుగ్గా అందాలంటే రూటర్‌ యాంటీనాలను రెండు డిఫెరెంట్‌ డైరెక్షన్స్‌లో ఉంచాలి. అప్పుడే ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, మొబైల్‌ల యాంటీనాలతో రూటర్‌ యాంటీనాలు కరెక్ట్‌గా మ్యాచ్‌ అవుతాయి. సిగ్నల్‌ స్ర్టెంగ్త్‌ : సిగ్నల్‌ స్ర్టెంగ్త్‌ని చెక్‌ చేసే బోలెడన్ని యాప్స్‌ ఉన్నాయి. ఓ యాప్‌ని మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంట్లో ఏ ప్రదేశంలో వైఫై సిగ్నల్‌ బలంగా ఉందో చెక్‌ చేసుకోవాలి. సరిగ్గా ఆ స్వీట్‌ స్పాట్‌లో రూటర్‌ను ఫిక్స్‌ చేసుకుంటే వైఫై సిగ్నల్‌ స్పీడ్‌కు ఢోకా ఉండదు. అల్యూమినియం ఫాయిల్‌ : రూటర్‌ యాంటీనాలకు అల్యూమినియం ఫాయిల్‌ చుడితే సిగ్నల్‌ వేగం పెరుగుతుంది.