పసిపాపపై పాశవిక చర్య..

SMTV Desk 2018-05-01 19:57:00  rape attempt on 3 years child, telangana, pocso act, hyderabad

హైదరాబాద్, మే 1 : సమాజంలో నానాటికి మహిళలకు రక్షణ కరువైపోతుంది. ఉదయం లేవగానే పత్రికలు, టీవీలు చూడాలంటే భయమేస్తుంది. దారుణమైన విషయం ఏమిటంటే.. ముక్కుపచ్చలారని పసి పిల్లలపై కొందరు కామా౦ధులు చేస్తున్న కీచకపర్వం మానవత్వం ఉందా..! లేదా..? అనే ప్రశ్నను కలిగిస్తుంది. సభ్యసమాజం తలదించుకోనేల... మానవత్వం సిగ్గుపడేలా... యావత్ భారత్ దేశం నివ్వెరపోయేలా.. ఇటీవల జమ్మూలో ఓ ఎనిమిదేళ్ల ఏళ్ల అసిఫా(ముస్లిం) అనే బాలికను కొందరు మృగాలుగా మారి చేసిన దారుణం మర్చిపోలేనిది. ప్రభుత్వం ఇటువంటి ఘటనలపై ఎన్ని చట్టాలు చేసిన సమాజంలో మార్పు రావడం లేదు. తాజాగా అభం శుభం తెలియని ఓ మూడేళ్ల మహాబుబ్ అనే యువకుడు పసిపాపపై ఒక అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ లో జైపురం గ్రామంలో జరిగింది. చిన్నారికి మాయమాటలు చెప్పి ఊరి చివరకు తీసుకెళ్లీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పాపను ఆసుపత్రిలో చేర్చారు. ఈ అఘాయిత్యనికి పాల్పడిన నిందితుడు మహాబుబ్ పై పోలీసులు నిర్భయ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జమ్మూ ఘటన జరిగిన తర్వాత దేశం మొత్తం నిరసనలు చెలరేగాయి. ఈ దారుణమైన ఘటనతో యావత్ భారతదేశ ప్రజలు విస్మయానికి గురయ్యారు. కానీ ఈ ఉదంతాన్ని కొన్ని రాజకీయ పార్టీలు మతం రంగును పూశాయి. దేశంలో అధికార పార్టీ బీజేపీ హిందువుల నియంతృత్వ ధోరణికి మద్దతు ఇస్తుందని కొన్ని పార్టీలు ఆరోపించాయి. మరి హిందువైన పసిపాపపై ముస్లిం మతస్థుడు లైంగిక దాడి చేశాడు. ఒక ముస్లిం యువకుడు చేసిన ఈ ఘటనపై ఎందుకు ఎవ్వరు నోరు మెదపడం లేదు. ఇలాంటి ఘటనలపై సమాజం గమనించాల్సిన అంశం ఏంటంటే.. మతాల కులాల ఆధిపత్య ధోరణి కంటే ఆడపిల్లల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. జరుగుతున్నా ఘటనలపై ప్రతి ఒక్కరు సామూహికంగా స్పందించిన రోజే ఈ నేరాలు ఆగుతాయి.