నలుపు తగ్గే మార్గం ఏంటంటే..!!

SMTV Desk 2018-05-01 18:04:59  black colour, tips, others.

కొంత మందికి ముఖం, కాళ్ళు, చేతులు.. ఇలా శరీర భాగాలన్నీ తెల్లగా ఉండి, తొడల మధ్య, పిరుదుల భాగం దగ్గర మాత్రం నల్లగా ఉంటాయి. తెల్లగా ఉండే వారికి ఈ నలుపు పెద్ద సమస్యగా మారుతుంది. ఇదేమైన విటమిన్ల లోపమో లేక చర్మ వ్యాధో తెలియక బాధపడుతుంటారు. నిజానికి ఈ నలుపు ఏ చర్మ వ్యాధి కాదు. అలాగే విటమిన్ల లోపం వల్ల వచ్చే సమస్య కాదు. తొడల మధ్య భాగం నల్లగా మారుతుంటే దానికి ప్రధాన కారణం అధిక బరువు ఉండటమే. అధికమైన బరువు వల్ల నడిచే సమయంలో రెండు తొడల మధ్య రాపిడి ఎక్కువగా ఉంటుంది. ఇలా జరిగినప్పుడు ఆ భాగం క్రమంగా నల్లగా మారుతుంది. బరువు ఎక్కువగా ఉంటే వ్యాయామాలు చేయాలి. ఇక పిరుదుల భాగంలో మిగతా శరీర భాగాల మీద మాములు చర్మం కంటే కొంచెం రంగు తక్కువగా, రఫ్ గా ఉండడం అనేది సాధారణమే. ఈ రెండు ప్రాంతాల్లోనూ రెండు శాతం హైడ్రో క్వినైన్, 0.025 శాతం టేట్రీనాయిన్ కలిపి రాత్రి వేళల్లో రోజు మార్చి రాసుకోవాలి. విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్లు తీసుకోవాలి. మూడు నెలల పాటు ప్రైమ్ రోజు ఆయిల్ కలిగినటువంటి సప్లిమెంట్లు కూడా క్రమం తప్పక తీసుకోవాలి. వీటి వల్ల నలుపు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ప్రతిరోజు తొడల మధ్య టాల్కం పౌడర్ రాయడం వల్ల రాపిడి కొంత తగ్గే అవకాశం ఉంది. పైకి కనిపించే శరీర భాగాల కాదు లోపల భాగాల పట్ల కూడా తగిన శ్రద్ధ కనబరిస్తే అక్కడ అనవసర సమస్యలు తలెత్తవు.