‘ఫ్యాట్’ మ్యాటర్.. తెలుసుకుంటే బెటర్

SMTV Desk 2018-05-01 14:50:14  fat matter, fat issues and tips, hyderabad, health tips

హైదరాబాద్, ఏప్రిల్ 30 : పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరగడం చాలా కష్టం. ఒక ప్రదేశంలో కేంద్రీకృతమైన కొవ్వును కరిగించడం సవాలుతో కూడుకున్న పని. ఈ కొవ్వును ఆరోగ్యకర రీతిలో తగ్గించుకుంటే మంచిది. పొట్ట తగ్గడానికి బాగా నడవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. >> కంప్యూటర్, మొబైల్ లేదా టీవీ చూస్తూ చాలా మంది ఆహారం తింటారు. ఇది చాలా మంచి ఆలవాటు కాదు. ఆహారం తీసుకొనేటప్పుడు వేరే ఏ పనులు చేయకూడదు. ఎందుకంటే గతంలో చేసిన స్టడీల్లో కూడా టీవీ చూస్తూ తినడం వల్ల మనకు తెలియకుండానే ఎక్కువ పరిమాణంలో తింటామని వెల్లడైంది. >> అవకెడో, మొలకలు, నల్ల నేరేడు పళ్లు, అవిసలు వంటి వాటిల్లో పీచు పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తొందరగా జీర్ణమవుతాయి. దీంతో పొట్ట తగ్గుతుంది. >> ఒత్తిడి వల్ల ఎడ్రినలిన్ గ్లాండ్స్ కోరిస్టాల్ ను అధికస్థాయిలో ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల కూడా పొట్టలో కొవ్వు బాగా ఎక్కువవుతుంది. >> ఆడవాళ్లలో ఎక్కువగా పొట్టలో కొవ్వు పేరుకుపోవడానికి కారణం వాళ్ల నడుము మగవాళ్ల కంటే పెద్దదిగా ఉండటమే. దీంతో సహజంగానే ఆడవాళ్లలో ఎక్కువ పరిమాణంలో కోరిస్టాల్ ఉత్పతి అవుతుంది. >> కండలు బలంగా ఉండడానికి చేసే వెయిట్ ట్రైనింగ్ వల్ల కూడా పొట్టలో పేరుకున్న కొవ్వు తగ్గుతుంది.