చెన్నై సారథి @ శతక విజయాలు

SMTV Desk 2018-05-01 12:37:48  ms dhoni, csk captain, 100 wons in csk, ipl

పుణె, మే 1 : ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డు సృష్టించాడు. టోర్నీలో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్ లో చెన్నై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ఇప్పటి వరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 100 విజయాలు నమోదు చేసింది. ఇవన్నీ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోనే కావడం విశేషం. చెన్నై సూపర్‌కింగ్స్‌ మొత్తం 166 (ఛాంపియన్స్‌ లీగ్‌తో కలిపి) మ్యాచ్‌లు ఆడగా శతక విజయాలు నమోదు చేసుకుంది. అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్ల జాబితాలో అగ్రస్థానంలో ముంబై ఇండియన్స్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ముంబయి ఇండియన్స్‌ 186 మ్యాచ్‌లు ఆడగా అందులో 104 విజయాలను నమోదు చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభానికి ముందు 94 విజయాలతో మూడో స్థానంలో ఉన్న చెన్నై 6 విజయాలు నమోదు చేసుకుని శతక విజయాలతో రెండో స్థానానికి చేరుకుంది.