టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లీ ఫలితాల విడుదల

SMTV Desk 2017-07-06 17:42:58  10th Class Advance Supplementary ExaminationBoard , officials students, SSC ADVANCED SUPPLY RESULTS 2017

హైదరాబాద్, జూలై 6 : రాష్ట్రంలో జరిగిన పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ రోజు బోర్డ్ అధికారులు విడుదల చేశారు. సాయంత్రం 4.30 నిమిషాలకు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేసినట్లు సమాచారం. ఈ మేరకు మార్చిలో నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో 5.38 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. అందులో 5.09 లక్షల మంది రెగ్యులర్ స్టూడెంట్స్ కాగా 29 వేల మంది ప్రైవేట్ విద్యార్థులు. మే 3న ఫలితాలు విడుదల చేయగా, అందులో 84.15 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఫెయిల్ అయిన మిగతా విద్యార్థులకు జూన్ లో నిర్వహించే అడ్వాన్స్ డ్ స‌ప్లీ పరీక్షలకు దాదాపు 50 వేల మంది హాజరైనట్లు బోర్డ్ తెలిపింది. ఫలితాల కోసం: http://www.results.manabadi.co.in http://www.schools9.com