అరుదైన శస్త్రచికిత్సతో శిశువుకు పునర్జన్మ

SMTV Desk 2018-04-30 18:38:27  Secunderabad, Gandhi Hospital, doctors, succusesful, operation

హైదరాబాద్, ఏప్రిల్ 30‌: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు అప్పుడే జన్మించిన శిశువుకు అరుదైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. నవజాతా శిశువు గొంతులో ఏర్పడిన కణితి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నెలకొంది. గమనించిన వైద్యులు వైద్య పరీక్షలు చేసి దీన్నో అరుదైన వ్యాధిగా గుర్తించారు. 24 గంటల్లోపే ఆ శిశువు గొంతుభాగంలో ఉన్న పెద్ద కణితిని పది మంది వైద్యుల బృందం రెండు గంటల పాటు శ్రమంచి శస్త్రచికిత్సను విజయవంతంగా ముగించింది. ఇలాంటి శస్త్రచికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయటం ఇదే తొలిసారని వైద్యులు పేర్కొన్నారు. ప్రయివేటు ఆసుపత్రిల్లో అయితే దీనికి రూ.8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు.