నోట్‌5 ప్రో ధర పెంచిన షియామీ

SMTV Desk 2018-04-30 17:58:53  redmi note 5, xiaomi, redmi note 5 price, china mobile company

ముంబై, ఏప్రిల్ 30 : ప్రముఖ మొబైల్‌ దిగ్గజం షియామీ రెడ్‌మి ఫోన్లకు ఇండియాలో చాలా ఆదరణ ఉంది. తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లను అందిస్తూ వినియోగదారులను తమ వైపు తిప్పుకుంటుంది. ఇటీవల మిడ్‌ రేంజ్‌లో షియామీ తీసుకొచ్చిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్‌5 ప్రో. రెండు వేరియంట్లలో లభిస్తున్న ఈ ఫోన్‌ ధరను కంపెనీ తాజాగా పెంచింది. ఫ్లాష్‌ సేల్‌ కోసం పడిగాపులు కాస్తున్న నోట్‌5 ప్రో అభిమానులకు ఇది కాస్త చేదు వార్త. 4జీ ర్యామ్‌, 64జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం ఉన్న రెడ్‌మి నోట్‌5 ప్రో వేరియంట్‌ ధర రూ.13,999 కాగా, ఇప్పుడు రూ.1,000 పెంచుతూ షియోమీ ఇండియా నిర్ణయం తీసుకుంది. కాగా, 6జీబీ ర్యామ్‌, 64జీబీ అంతర్గత మొమరీ సామర్థ్యం ఉన్న ఫోన్‌ ధరను రూ.16,999 వద్ద యథాతథంగా ఉంది. రెడ్‌మి నోట్‌5 ప్రో ప్రత్యేకతలు * 5.9 అంగుళాల ఫుడ్‌ హెచ్‌డీ డిస్‌ప్లే(18:9 రేషియో) * స్నాప్‌డ్రాగన్‌ 636 * 4జీబీ ర్యామ్‌, 64మెమొరీ‌/6జీబీ ర్యామ్‌+64జీబీ మెమొరీ * 12+5మెగాపిక్సెల్‌ వెనుక కెమెరాలు * 20 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా విత్‌ ఫ్లాష్‌ * ఎంఐయూఐ 9, ఆండ్రాయిడ్‌ నౌగట్‌ * 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం