మోదీ ఇజ్రాయెల్ పర్యటన విశేషాలు!!

SMTV Desk 2017-07-06 17:37:05  israel, modi,benjamin netanyahu

ఇజ్రాయెల్, జూలై 06 : ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన దాదాపుగా తుది దశకు చేరుకుంది. మూడో రోజు పర్యటనలో భాగంగా మోదీ మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనికులకు హైఫాలో ఘన నివాళి అర్పించారు. మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ బెంజమిన్ నెతాన్యహు కూడా హాజరయ్యారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరుపున లక్షలాది మంది భారతీయ సైనికులు పోరాడి చారిత్రిక హాఫియా ఫోర్ట్ ను విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో భారత బృందానికి నేతృత్వం వహించిన దళపత్ సింగ్ షేక్ అవర్తస్ మార్క్ చిహ్నాన్ని కూడా వారు ఆవిష్కరించారు. ఇజ్రాయెల్ లో స్థిరపడ్డ భారత యూదులకు కానుక ఇచ్చారు మోదీ. ప్రతి యేట సెప్టెంబర్ 23న భారత సైన్యం హాఫియా దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అసలు విషయానికొస్తే మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో మోదీ వ్యవసాయ, రోదసి రంగం, డిఫెన్స్ రంగం, నీటి పారుదల రంగాల్లో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు ఢిల్లీ, ముంబై నుండి విమానాల సంఖ్యని పెంచారు. అలాగే ముంబై దాడుల నుండి తప్పించుకున్న బాలుడు మోషేను భారత్ కు రావాలని ఆహ్వానించారు మోదీ. మోషేకు భారత్ లో ఎప్పుడైన పర్యటించడానికి శాశ్వత వీసా అవకాశం కల్పిస్తామన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటన సందర్భంగా తోడుగా మోషేను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య మైత్రి చిరకాలం ఉంటుందన్నారు మోదీ.