నేటికి సరిగ్గా నెల రోజుల క్రితం...

SMTV Desk 2018-04-30 17:38:51  ANASUYA, RANGASTHALAM, ANASUYA TWITTER, PHOTOS SHARING.

ముంబై, ఏప్రిల్ 30 : "రంగస్థల౦"చిత్రం రిలీజ్ అయి నేటికి సరిగ్గా నెలరోజులు. విడుదలైన నాటి నుండి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కి౦చి అందరిని 1980 లోకి తీసుకెళ్ళిన ఘనత దర్శకుడు సుకుమార్ ది. ప్రతి ఒక్కరి పాత్రను మలిచిన తీరు ప్రేక్షకులను కట్టి పడేసింది. అటు అభిమానుల నుండే కాదు ఇటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సందర్భంగా రంగ‌మ్మ‌త్త‌గా న‌టించిన అన‌సూయ.. నెలరోజులు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ట్వీట్ చేసింది. "సరిగ్గా నెల రోజుల క్రితం రంగస్థలం అనే ఒక మాయా ప్రపంచం ఆవిష్కృతమైంది. అందులో కొన్ని మధుర క్షణాలను మీతో పంచుకుంటున్నాను. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించినందుకు మీ అందరికి నా ధన్యవాదాలు" అంటూ కొన్ని ఫోటోలను సైతం పోస్ట్ చేశారు.