కోహ్లి క్యాచ్ కు.. అనుష్క శర్మ ఫీలింగ్ చూశారా..?

SMTV Desk 2018-04-30 17:26:11  kohli catch, anushka sharma, rcb kohli, kkr, ipl

బెంగళూరు, ఏప్రిల్ 30 : విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆడే మ్యాచ్‌లకు హాజరవుతూ జట్టుకు మద్దతు ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌కు అనుష్క వచ్చింది. మ్యాచ్‌ మధ్యలో కోహ్లీ పట్టిన ఓ క్యాచ్‌కు గ్యాలరీలో కూర్చున్న అనుష్క ఇచ్చిన రియాక్షన్‌ ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టులో సారథి కోహ్లీ 44 బంతుల్లో 68 పరుగులు చేయడంతో ఆ జట్టు నిర్ణీత 175 పరుగులు చేసింది. తర్వాత కోల్‌కతా ఇన్నింగ్స్‌లో కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. 19వ ఓవర్లో సిరాజ్‌ వేసిన 5వ బంతిని ఎదుర్కొన్న దినేశ్‌ కార్తీక్‌ దాన్ని గాల్లోకి లేపాడు. ఆ బంతిని కోహ్లీ అద్భుతంగా క్యాచ్‌ పట్టాడు. గ్యాలరీ నుంచి కోహ్లీ పట్టిన క్యాచ్‌ చూసిన అనుష్క వావ్‌ అన్నట్టు భలే రియాక్షన్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ‘అనుష్క ఇచ్చిన రియాక్షన్‌కు వెల కట్టలేం; సూపర్‌ క్యాచ్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.