నువ్వు "102 నాటౌట్‌" నేను "103 నాటౌట్..!!

SMTV Desk 2018-04-30 17:07:38  amitaab bacchan. 102 not out, umesh shuklaa, bollywood

ముంబై, ఏప్రిల్ 30 : బాలీవుడ్ అగ్ర కథానాయకుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "102 నాటౌట్‌". ఈ చిత్రానికి ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించారు. ఇందులో అమితాబ్ 102 ఏళ్ళ వ్రుద్దుడిగా నటించారు. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు బతికిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలని అమితాబ్ అనుకుంటాడు. అలనాటి నటుడు రిషి కపూర్‌ అమితాబ్‌కు కుమారుడిగా నటించారు. అతని వయస్సు 72 సంవత్సరాలు ఉంటుంది. ఈ నేపథ్యంలో తండ్రీ కొడుకుల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయి..? ఇంతకి అమితాబ్ రికార్డును నెలకొల్పాడా..! లేదా..! అన్నదే సినిమా కథ. అయితే ఈ సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా యూనిట్‌ను విష్‌ చేస్తూ 103 ఏళ్ల బామ్మ ఓ వీడియోను బిగ్‌బి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. "ఆల్‌ ది బెస్ట్‌ అమితాబ్‌. నువ్వు "102 నాటౌట్‌" నేను "103 నాటౌట్‌" అంటూ బామ్మ చెబుతున్న తీరు నవ్వులు పూయిస్తోంది. కాగా ఈ వీడియోకు అమితాబ్ రిప్లై ఇస్తూ.. "ఈ లవ్లీ లేడీ నాకు విషెస్‌ చెప్తున్నారు. దేవుడు ఆమెను చల్లగా చూడాలి. ధన్యవాదాలు" అని ట్వీట్‌ చేశారు. మే 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.