కనిమొళితో భేటీ అయిన కేసీఆర్

SMTV Desk 2018-04-30 15:17:04   CM KCR Meets DMK Leader Kanimozhi

చెన్నై, ఏప్రిల్ 30: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు చెన్నైలో పర్యటిస్తున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆదివారం చెన్నైలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధితో భేటీ అయిన ఆయన.. ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. అన౦తరం రెండో రోజు పర్యటనలో భాగంగా కేసీఆర్‌తో డీఎంకే ఎంపీ కనిమొళి బేటీ అయ్యారు. స్థానిక ఐటీసీ చోళ హోటల్‌లో కేసీఆర్‌తో సమావేశమైన ఆమె ఫెడరల్‌ ప్రంట్‌, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించనున్నారు. వారితో పాటు మంత్రులు కేకే, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమావేశంలో ఉన్నారు.