కేసీఆర్‌ జుట్టు మోదీ చేతుల్లో ఉంది: పొన్నాల

SMTV Desk 2018-04-30 14:59:43  Ponnala Lakshmaiah slams On CM KCR

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: కేసీఆర్ సీబీఐ కేసుల్లో ఉన్నారని... కేసీఆర్‌ జుట్టు మోదీ చేతుల్లో ఉందని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. దమ్ముంటే మిషన్ కాకతీయ, భగీరథపై విచారణ జరిపించాలని పొన్నాల సవాల్ విసిరారు. తప్పిదాలు కప్పి పుచ్చుకోవడానికే కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌కు పూనుకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెసేతర ఫ్రంట్‌ అసాధ్యమని సీపీఎం, డీఎంకే, బీజేడీ ఎప్పుడో చెప్పాయన్నారు. కేసీఆర్‌ మూడో ఫ్రంట్ రెండు రోజుల ముచ్చటే అని పొన్నాల ఎద్దేవా చేశారు.