ఐశ్వర్య చిత్రంలో రాజశేఖర్..!!

SMTV Desk 2018-04-30 13:55:56  aishwarya dhanush, director, rajashekar, aishwarya dhanush next movie.

హైదరాబాద్, ఏప్రిల్ 30 : సూపర్ స్టార్ రజనీ కాంత్ కూతురిగానే కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు ఐశ్వర్య ధనుష్. దర్శకురాలిగా "3" చిత్రంతో పరిచయమై ఆ వెంటనే "వై రాజా వై" చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలు ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఐశ్వర్య.. తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టలేదు. కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ మెగా ఫోన్ పట్టారు. ప్రస్తుతం ఐశ్వర్య రూపొందించబోయే చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఇందుకోసం తెలుగు తమిళ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమవనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ముఖ్య భూమిక పోషించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.