మట్టితో మెరుపులు..

SMTV Desk 2018-04-30 13:40:57  clay for health tips, body care, skin care, hyderabad

హైదరాబాద్, ఏప్రిల్ 30 : నేచురోపతి కేంద్రాలలో శారీరక వ్యవస్థను పరిశుభ్రపరిచే విధానాలు ఉంటాయి. ఒత్తిడి కలిగించే మసాజ్ ల నుండి వేడి, చల్లని కంప్రేషన్ల దాకా చర్మాన్ని చైతన్యవంతంగా చేస్తుంది. భూమిపై నుండి మూడుడగుల లోపలి శుభ్రమైన మట్టితో ప్యాక్స్ వేయడం ద్వారా చర్మం మీద ఏర్పడిన పోర్స్ తోలిగిస్తారు. శారీరక మాలిన్యాలు తొలిగిపోవడానికి యోగాభ్యాసం అవసరం. చర్మకాంతి పెరగడానికి అనుకూల దృక్పథం అవసరమని ప్రకృతి వైద్యం చెప్తుంది. జీవన విధానాన్ని సమతౌల్యపరచడం, మానసిక విశ్రాంతి, శరీరంలో చురుకుదనం కలిగించడం, తాజా అనుభూతులు, ఉత్సాహం కలిగించేదుకు ప్రకృతి చికిత్సా విధానాలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సహజమైన ఔషదాలు, గుడ్లు, పాలు, పెరుగు వంటి వాటితో చేసిన తాజా గుజ్జులను ఉపయోగించడం ద్వారా ఫేషియల్ ట్రీట్ మెంట్స్ ఇస్తారు. వీటిని పరిశుభ్రమైన నీటితో కలిపి చర్మానికి చికిత్స చేస్తారు. సమతౌల్య వాతావరణ పరిస్థితులు, ఒత్తిడి, టెన్షన్, వల్ల శరీరంలో సహజ తైలాలను విటమిన్లు కోల్పోవలిసి వస్తుంది. కాబట్టి శరీరాన్ని ప్రకృతి పరంగా కాపాడుకోవాలి. కాని పై పూతలు, కెమికల్స్ వంటివి ఉపయోగించడం వల్ల కాదని ప్రకృతి వైద్యులు చెప్తారు.