ఆశల పల్లకిలో.. సీఎం అభ్యర్ధులు..

SMTV Desk 2018-04-30 12:50:16  BS Yeddyurappa, HD Kumaraswamy, Siddaramaiah, karnataka elections

కర్ణాటక, ఏప్రిల్ 30 ; కర్ణాటకలో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు తమ వ్యుహలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీజేపీ ల మధ్య పోరు హోరా హోరిగా జరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్‌ కూడా కింగ్ మేకర్ అవ్వాలని భావిస్తుంది. కాగా ఈ ఎన్నికల్లో ఆయా పార్టీ సీఎం అభ్యర్ధుల వారి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిద్దరామయ్య.. (కాంగ్రెస్) "చాముండేశ్వరి, బాదామిలో... రెండు చోట్ల పోటీ చేస్తున్నా. రెండు చోట్లా గెలుస్తాను. రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా. మా పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవు. పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది. కర్ణాటకలో మోదీ ప్రభావమే లేదు" కుమార స్వామి.. జేడీఎస్‌ "మాజీ ప్రధాని దేవెగౌడకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారు. జేడీఎస్‌ గెలుపు ఖాయం. ఆయన జన్మదినం మే 18న సీఎంగా బాధ్యతలు చేపడతా. మైసూరు ప్రాంతంలో తిరుగులేని మెజారిటీ వస్తుంది, ఉత్తర కర్ణాటకలో 35 స్థానాల్లో గెలుస్తాం. సీఎంగా బాధ్యతలు చేపట్టి రైతు సంక్షేమం కోసం పాటుపడతా" యడ్యూరప్ప.. బీజేపీ "ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు. మే 18 లేదా 19న సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా. బెంగళూరు కంఠీరవా స్టేడియంలో కనీసం 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు, పార్టీ కార్యకర్తల సమక్షంలో సీఎంగా బాధ్యతలు చేపడతా. ప్రధాని మోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 23 మంది సీఎంలు ఆ ఉత్సవంలో పాల్గొంటారు"