మెరిసే చర్మం కోసం ‘ఐస్’..

SMTV Desk 2018-04-30 12:05:41  Ice, skin problems, others, skin tips.

హైదరాబాద్, ఏప్రిల్ 30 : ఐస్ ను చాలా మంది తేలికగా తీసుకుంటారు. ఐస్ చర్మ సౌందర్యం కోసం ఎంత ఉపయోగపడుతుందో తెలుసా..! ఖరీదైన మేకప్ లను వాడే ముందు ఒకసారి ఐస్ ను వాడి చూడండి. >> మేకప్ వేసుకొనే ముందు ఖరీదైన ప్రైమర్ తో కాకుండా.. ఐస్ తో మొదలుపెట్టండి. ఐస్ ఎక్కువసేపు మేకప్ ను చర్మానికి పట్టి ఉంచేలా సాయపడుతుంది. ఫేస్ మిస్ట్ గా ఐస్ ఉపయోగపడుతుంది. >> కళ్ల చుట్టూ వలయాలు, ఉబ్బిన కళ్లతో బాధపడే వారు ఉదయాన్నే, రాత్రి పడుకునే ముందు కళ్ల చుట్టూ ఐస్ రాసుకుంటే మంచిది. >> చర్మం పాలిపోయినట్లు రంగు తగ్గినట్లు అనిపిస్తే మొదట ఐస్ ను ప్రయత్నించండి. దీనికి కాస్త నిమ్మరసం జోడించాలి. >> అలర్జీ ఉంటే ఐస్ థెరపీ మంచి పద్ధతి. ముందుగా నీటిని, కొబ్బరి నూనెను సమానంగా తీసుకొని ఫ్రిజ్ లో పెట్టాలి. గడ్డ కట్టిన తర్వాత చర్మంపై రాస్తే అలర్జీ నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.